మూడు వారాలుగా చెట్లమీదనే జీవనం..!!

మూడు వారాలుగా చెట్లమీదనే జీవనం..!!

గత కొన్ని రోజులుగా బీహార్లో వర్షాలు విపరీతంగా కురుస్తున్నాయి.  ఈ వర్షాల ధాటికి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు.  లోతట్టు ప్రాంతాలు వరదలో మునిగిపోవడంతో అక్కడి ప్రజలను ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించారు.  అయితే, బీహార్ లోని భాగర్ పుర జిల్లాలోని అనేక ప్రాంతాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి.  అక్కడి నుంచి ప్రజలను వివిధ ప్రాంతాలకు తరలించినా ఇంకా చాలామంది వరదనీటిలోనే ఉండిపోయారు. 

ఇక కొంతమందైతే.. సమీపంలోని చెట్లపైనే ఉంటున్నారట.  గత మూడు వారాలుగా వాళ్ళు చెట్లపైనే జీవనం సాగిస్తున్నారు.  తాగేందుకు నీరు, తినేందుకు ఆహరం దొరక్క నానా ఇబ్బందులు పడుతున్నారట.  బయటకు వచ్చి తమ గోడును వెళ్లబోసుకోవడానికి వీలులేకుండా పోయిందని ప్రజలు వాపోతున్నారు.  వరదనీరు ఎప్పుడు తగ్గుతుందా అని వేచి చూస్తున్నారు.