మోగనున్న ఎన్నికల నగారా.. బీహార్ తో పాటు దేశ వ్యాప్తంగా !

మోగనున్న ఎన్నికల నగారా.. బీహార్ తో పాటు దేశ వ్యాప్తంగా !

ఈ రోజు మధ్యాహ్నం 12:30 గంటలకు బీహార్ ఎన్నికల షెడ్యూలు విడుదల కానుంది. బీహార్ అసెంబ్లీ తో పాటు, దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలకు ఉప ఎన్నికలని కూడా అనౌన్స్ చేసే అవకాశం కనిపిస్తోంది. కోవి విజృంభిస్తున్న పరిస్థితుల్లో జరగనున్న ఎన్నికలకు ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. అయితే ఇప్పటికే బీహార్‌ లో ఎన్నికల వేడి రాజుకుంది.

అధికారాన్ని నిలబెట్టుకునేందుకు జేడీయూ, బీజేపీ కూటమి ప్రయత్నాలు చేస్తోంది. జేడీయూను  ఓడించి ఈ సారి ఎలాగైనా అధికారంలోకి రావాలని రాష్ట్రీయ జనతాదళ్ భావిస్తోంది. సుశాంత్ సింగ్ కేసు తర్వాత దేశంలో జరుగుతున్న తొలి ఎన్నికలు ఇవే. ఈ కేసు విషయంలో బీహార్, మహారాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య విభేదాలు తలెత్తడం, బీహార్ డీజీపీ స్వచ్ఛంద పదవీవిరమణ చేసి ఎన్నికల బరిలోకి దిగనుండడంతో....ఎన్నికల ప్రక్రియపై దేశం యావత్తూ ఆసక్తి ప్రదర్శిస్తోంది.