మెదడువాపు వ్యాధికి బీహార్ లో 73 మంది బాలల మృతి

మెదడువాపు వ్యాధికి బీహార్ లో 73 మంది బాలల మృతి

బీహార్ లో మెదడువాపు వ్యాధి మరణ మృదంగం మోగిస్తోంది. శనివారానికి మెదడువాపు వ్యాధి బారిన పడిన చనిపోయిన పిల్లల సంఖ్య 73కి చేరింది. బీహార్ ఆరోగ్యశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ 69 మంది బాలలు చనిపోయినట్టు ప్రకటించారు. శుక్రవారం 57గా ఉన్న మృతుల సంఖ్య కేవలం 24 గంటల్లోనే పెరిగిపోయింది. మరో 12 మంది పిల్లలు మహమ్మారికి బలయ్యారు. వీళ్లంతా రాజధాని పాట్నాకి 75 కి.మీల దూరంలోని ముజఫర్ పూర్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 

80 మందికి పైగా పిల్లలు మెదడువాపు వ్యాధి కారణంగా చనిపోయారని అనధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. ఆస్పత్రిలో చేర్చకుండానే గ్రామాల్లో బాలలు మరణిస్తున్నట్టు చెబుతున్నారు. శనివారం బెగూసరాయ్ జిల్లాలో ఇద్దరు, తూర్పు చంపారన్ జిల్లాలో ముగ్గురు కన్నుమూశారు. ముజఫర్ పూర్ లోని రెండు ఆస్పత్రుల్లో పిల్లలు చనిపోయినట్టు తెలిసింది. రేపు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు.