మరికొద్ది రోజుల్లోనే పెళ్లి.. ఇంతలోనే 

మరికొద్ది రోజుల్లోనే పెళ్లి.. ఇంతలోనే 

మరికొద్ది రోజుల్లో వారి ఇంట్లో శుభకార్యం. బంధు, మిత్రులకు ఆహ్వాన పత్రికలు అందించేందుకు బైక్ పై వెళుతున్నారు. ఇంతలో లారీ రూపంలో వచ్చిన మృత్యువు కాటేసింది. వివరాల్లోకి వెళితే.. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం తాడ్ధన్ పల్లి వద్ద బైక్ ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చింటు, ప్రభాకర్ అనే ఇద్దరు యువకులు మృతి చెందారు. కొద్దిరోజుల్లో ఇంట్లో జరగనున్న శుభకార్యానికి సంబంధించిన ఆహ్వాన పత్రికలను బంధువులకు ఇచ్చేందుకు వెళుతూ ప్రాణాలు కొల్పోవడంతో వారి మృతుల కుటుంబాల్లో విషాదం నెలకొంది.