అదృష్టం అంటే ఇదే మరి..!

అదృష్టం అంటే ఇదే మరి..!

ఆయుష్షు ఉండి.. దానికి అదృష్టం తోడైతే ఏం జరుగుతుందో తెలుసా? ఐతే ఈ వీడియో చూడండి. ఓ బైక్‌పై స్పీడ్‌గా వచ్చిన ఓ యువకుడు  ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టాడు. గిరగిరా తిరిగి పల్టీలు కొడుతూ తుళ్లిపడ్డాడు. అదృష్టవశాత్తూ చిన్న గాయం కూడా అవకపోవడంతో ఎంచక్కా లేచి బైక్‌ స్టార్ట్‌ చేసి వెళ్లిపోయాడు. నిన్న ప్రగతి నివేదన సభ సందర్భంగా కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్‌ పోలీసులు వన్‌ వే విధించారు. ఈ సందర్భంగా రాంగ్‌ రూట్‌లో ఓవర్‌ స్పీడ్‌తో వచ్చిన ఆ యువకుడు ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టి బంతిలా తిరుగుతూ కిందపడ్డాడు.   అటు పక్కగా వెళ్తున్న వారంతా ఈ ప్రమాదం చూసి షాక్‌కు గురైనా.. ఆ యువకుడు మాత్రం తనకేం పట్టనట్టు వ్యవహరించాడు.