ఎన్డీఏ నుంచి తప్పుకున్న జీజేఎం...
బీజేపీ ఇచ్చిన మాట తప్పింది. మేము అడిగిన వాటిని విస్మరిస్తుందని జీజేఎం బిమల్ గురుంగ్ అన్నాడు. అందుకే ఎన్డీఏ నుంచి తప్పుకుంటున్నాని చెప్పారు. వచ్చే ఏడాది ఎన్నికల్లో బీజేపీకి సపోర్ట్ ఇవ్వమన్నారు. అయితే గోర్కాల్యాండ్ కు ప్రత్యేక రాష్ట్ర హోదా ఇవ్వలేదని, కమలం పార్టీ తమను మోసం చేసిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా కావాలంటే పశ్చిమబెంగాళ్ లో వరుసగా మూడో సారీ గెలిచేందుకు మమతా బెనర్జీకి పూర్తి సపోర్ట్ ఇస్తానని అన్నారు. వచ్చే ఎన్నికల్లో తన పూర్తి మద్దతు తృణమూల్ కాంగ్రెస్ కు ఇస్తాన్నారు. అంతేకాకుండా మమతా బెనర్జీ ఇచ్చిన మాట నిలబెట్టుకుందని, ఎన్నికల్లో మమతా బెనర్జీను గెలిపించి బీజీపీకు తగిన బుద్ది చెబుతామని బిమల్ గురుంగ్ అన్నారు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)