5 పైసలకే బిర్యానీ.. వదిలేస్తారా? క్యూ కట్టారు మరి..!

5 పైసలకే బిర్యానీ.. వదిలేస్తారా? క్యూ కట్టారు మరి..!

బిర్యానీ అంటేనే నోట్లో నీళ్లురుతాయి.. నచ్చిన బిర్యానీ కోసం ఎంతదూరమైనా వెళ్తారు..! ఇక.. ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ వచ్చిన తర్వాత వీటిపై మంచి ఆఫర్లు కూడా అభిస్తున్నాయి. 20 శాతం, 30 శాతం, కొన్ని సార్లు అయితే 50 శాతం వరకు డిస్కౌంట్ ధరల్లో బిర్యానీ లభిస్తుండగా.. బిర్యానీ ప్రియులు మరీ పోటీపడి బుక్ చేస్తున్నారు. మరీ 5 పైసలకే బిర్యానీ అంటే ఊరుకుంటారా..? తమిళనాడులో ఇలాంటి ఆఫర్ ప్రకటించాడో వ్యక్తి.. దిండుక్కల్ బస్టాండ్ సమీపంలోని ముజిఫ్ బిర్యానీ సెంటర్‌లో 5 పైసలకే ఒకటిన్నర ప్లేట్ బిర్యానీ అందిస్తామని ప్రకటించారు. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.. ఇక, బుధవారం ఉదయం నుంచే ఐదు పైసల బిర్యానీ సెంటర్‌ ముందు క్యూ కట్టారు... అయితే, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. కేవలం 5 పైసల నాణెంపైనే ఈ బిర్యానీ అందజేస్తారు. ఇక, భవిష్యత్ తరాలకు మనం ఉపయోగించిన వస్తువులు, నాణేలపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే బిర్యానీపై 5 పైసల ఆఫర్ పెట్టామని.. ఇలా 5 పైసల నాణేలు సేకరించామని ఆ బిర్యానీ సెంటర్ యజమాని తెలిపారు.