బర్త్‌డే బాయ్ రానా..విష్ చేసిన తారలు..

బర్త్‌డే బాయ్ రానా..విష్ చేసిన తారలు..

రానా దగ్గుపాటి పరిచయం అక్కర్లేని పేరు. భల్లాలదేవగా అందరిని ఆకట్టుకుని అతడి అభిమానులుగా మార్చేసుకున్నాడు. లీడర్ సినిమాతో తనతోని నాయత్వాన్ని చూపిస్తూ అందరిని ఆకట్టుకున్నాడు. తరువాత బాలీవుడ్‌లోకీ రానా వెళ్లాడు. దమ్ మారో దమ్ సినిమాతో బాలీవుడ్‌లోని తన మార్క్ వేశాడు. అప్పటి నుంచి వైవిధ్యమైన కథలతో విలక్షణమైన నటనతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. తనదైన ప్రతిభతో అగ్ర హీరోగా పేరు తెచ్చుకున్నాడు. అయితే నేడు రానా తన 36వ పుట్టిన రోజును జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా రానా నూతన సినిమా విరాట పర్వం తన ఫస్ట్‌లుక్ విడుదల చేసింది. అంతేకాకుండా సినిమాలో రానా కారెక్టర్ ఫస్ట్ గ్లింప్స్‌ను చూపుతూ వీడియోను రిలీజ్ చేసింది. ఇదిలా ఉంటే రానా చిత్ర సీమలోని అందరితో చాలా జాలీగా కలిసిపోయి ఉంటాడు దాంతో నేడు రానాపై విషెస్ వెల్లువలా కురిశాయి. ట్విటర్ ద్వారా రానాను విష్ చేశాడు. విజయం, ఆనందం ఎల్లప్పుడూ నీతో ఉండాలని మహేష్ తన ట్వీట్‌లో రాశాడు. హాపీ బర్త్‌డే బిగ్ గాయ్, పిల్లాడి మనస్తత్వం ఉన్న అగ్ర హీరో, నా సన్నిహిత స్నేహితుడు అంటూ నాచురల్ స్టార్ నానీ రానాను విష్ చేశాడు. నా దగ్గర మన కొత్త ఫోటోలు లేవు, పాతవి పెట్టలేను అందుకే పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ట్వీట్ చేశాడు. వీరితో పాటుగా రానా సరసన చేస్తున్న సాయి పల్లవి కూడా తన ట్విటర్ ద్వారా రానాకు తన విషెస్ తెలిపింది. హాపీ బర్త్‌డే రానా, నువ్వు రోజురోజుకి ఇంకా బలంగా అవ్వాలి. ఆనందం, ప్రశాంత అన్ని ఎల్లప్పుడూ నీకు ఉండాలి అంటూ రాసింది. వీరితో పాటు మరెందరో తారలు తమతమ విషెస్ తెలిపారు. ఇక అభిమానుల సంగతి ప్రత్యేకంగా చెప్పాలా. వారు రానా పుట్టిన రోజును పండుగలా చేశారు.