ఏపీకి కొత్త గవర్నర్...

ఏపీకి కొత్త గవర్నర్...

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి కొత్త గవర్నర్‌ను నియమించింది కేంద్రం ప్రభుత్వం... ఏపీకి గవర్నర్‌గా బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను నియమించింది. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులను కూడా జారీ చేసింది రాష్ట్రపతి భవన్. బీజేపీ ఒడిశా రాష్ట్ర అధ్యక్షుడిగా 1980-88 వరకు పనిచేసిన బిశ్వభూషణ్‌.. అంతకు ముందు ఓ సోషల్ వర్కర్‌గా సమాజంలోని అట్టడుగు వర్గాలకు ఉండే హక్కుల గురించి పోరాటం చేశారు. సుదీర్ఘకాలం పాటు సంఘ్‌పరివార్‌తో ఆయనకు అనుబంధం ఉంది. సిలికా అసెంబ్లీ స్థానం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన బిశ్వభూషణ్‌, న్యాయశాఖ మంత్రిగా కూడా పనిచేసిన అనుభవం ఉంది. న్యాయవాది కూడా ఆయన సేవలు అందించారు. రచయితగా పలు పుస్తకాలనూ రచించారు బిశ్వభూషణ్‌. 1971 నుంచి జన్‌సంఘ్‌లో ఉన్న ఆయన.. 1988 నుంచి బీజేపీలో క్రియాశీలకపాత్ర పోషించారు. కాగా, రాష్ట్ర విభజన జరిగిన ఐదేళ్ల తర్వాత ఏపీకి ప్రత్యేకంగా గవర్నర్‌ను నియిమించింది కేంద్రం. ఉమ్మడి ఏపీకి గవర్నర్‌గా ఉన్న నరసింహన్‌ను.. ఇంత కాలం రెండు రాష్ట్రాలకు గవర్నర్‌గా కొనసాగించిన కేంద్రం... తాజాగా గవర్నర్‌ నరసింహన్‌ను తెలంగాణకు పరమితం చేస్తూ.. ఏపీకి గవర్నర్‌గా బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను నియమించారు.