మళ్ళీ బిట్‌కాయిన్‌ వెలుగులు

మళ్ళీ బిట్‌కాయిన్‌ వెలుగులు

ఒకదశలో ఇన్వెస్టర్లను దివాళా తీసిన బిట్‌కాయిన్‌ ఇపుడు మళ్ళీ కళకళలాడుతోంది.  సోమవారం 10 శాతం పెరిగి 9000 డాలర్లకు చేరింది. 2017లో ఆల్‌ టైమ్‌ గరిష్ఠ స్థాయికి చేరిన తరవాత బిట్‌ కాయిన్‌ భారీగా క్షీణించింది.అప్పటి నుంచి అంటే గడచిన రెండేళ్ళలో మే నెలలో రికార్డు స్థాయిలో బిట్‌కాయిన్‌ పెరిగింది. బిట్‌ కాయిన్‌ మార్కెట్‌లో ప్రవేశించనున్నట్లు ఫేస్‌బుక్‌ వెల్లడించిన నేపథ్యంలో ఎటీ అండ్‌ టీ కూడా కొత్త నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి తన నెట్‌ వర్క్‌ ద్వారా బిట్‌కాయిన్స్‌లో బిల్లలు చెల్లించేందుకు అనుమతించనున్నట్లు ఎటీ అండ్‌ టీ వెల్లడింది. పలు బ్రోకింగ్‌ సంస్థలు బిట్‌ కాయిన్‌ భవిష్యత్తు గురించి ఆందోళన వ్యక్తం చేసినా... కేవలం ఒకే ఒక్క నెలలో బిట్ కాయిన్‌ దాదాపు 70 శాతం పెరిగింది. అనేక అంతర్జాతీయ సంస్థలు, బహుళ జాతి కంపెనీలు బిట్‌ కాయిన్‌ను తీసుకునేందుకు అంగీకరిస్తుండటంతో బిట్‌ కాయిన్‌ పట్ల జనాల్లో ఆసక్తి పెరుగుతోంది.