మహాకూటమిపై క్లారిటీ ఇచ్చిన నవీన్‌ పట్నాయక్

మహాకూటమిపై క్లారిటీ ఇచ్చిన నవీన్‌ పట్నాయక్

బీజేపీయేతర పక్షాలను అన్నింటినీ జాతీయ స్థాయిలో ఏకం చేసే ప్రయత్నాలు సాగుతున్నాయి... మహాకూటమి పేరుతో అన్ని పార్టీలను ఏకం చేసే కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. అయితే, తాము మహాకూటమిలో ఉండబోదని స్పష్టం చేశారు బిజూ జనతా దళ్ అధ్యక్షుడు, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్. బీజేపీతో పాటు కాంగ్రెస్ పార్టీకి కూడా తాము దూరంగా ఉంటామని ప్రకటించారు. మహాకూటమిలో చేరడంపై తాము ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఢిల్లీలో రైతులు నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ప్రకటన చేసిన ఆయన.. మరునాడే... మహాకూటమిలో ఉండబోవడం లేదంటూ చేసిన ప్రకటన అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే కీలకమైన 2019 సాధారణ ఎన్నికలకు ముందు పలు పార్టీల మధ్య పొత్తుల చర్చలు జరుగుతున్నాయని వెల్లడించారు. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు... బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీయేతర ఫెడరల్ ఫ్రంట్‌ నిర్మించటానికి పూనుకున్నారు... ఇప్పటికే నవీన్ పట్నాయక్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కలిసిన సంగతి తెలిసిందే.