మళ్లీ బీజేపీ దగ్గరికే..! జనసేన, బీజేపీ నేతల భేటీపై ఆసక్తి..

మళ్లీ బీజేపీ దగ్గరికే..! జనసేన, బీజేపీ నేతల భేటీపై ఆసక్తి..

జనసేన మళ్లీ కాషాయసేన కాబోతోంది. ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ ఢిల్లీ టూర్‌లో బీజేపీ పెద్దలతో పొత్తు దిశగానే చర్చలు జరిపినట్టు తెలిసింది. దీనిపై జనసేనాని కూడా సంకేతాలు ఇచ్చారు. మరిన్ని భేటీలు జరుగుతాయని, ఆ తర్వాత దీనిపై మరింత స్పష్టత వస్తుందన్నారు. ఢిల్లీ పెద్దల డైరెక్షన్‌లో బీజేపీ రాష్ట్రనేతలు.. ఈనెల 16న జనసేన నాయకులతో భేటీ అవుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసి సాగాలని ఈ రెండు పార్టీలూ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. సమావేశంలో ఆ దిశగా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

కాగా, 2014లో బీజేపీ, టీడీపీలతో కలిసి పనిచేసిన జనసేన.. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో తప్ప ఇతర ఏ అంశాల్లో బీజేపీతో ఇబ్బంది లేదని గతంలోనే ప్రకటించింది. దీంతో ఆ రెండు పార్టీలకు మధ్య ఎక్కడా పెద్దగా పొరపచ్చాలు రాలేదు. 2019 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీలను వదిలి కమ్యూనిస్టులతో జతకట్టిన జనసేన.. ఘోరంగా విఫలమైంది. అయితే, జనసేన, బీజేపీలు మరోసారి జట్టుకట్టనుండటం.. రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిని రేపుతోంది.