చంద్రబాబు అతిగా స్పందిస్తున్నారు...

చంద్రబాబు అతిగా స్పందిస్తున్నారు...

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు... ఢిల్లీలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ విషయంలో అతిగా స్పందిస్తున్నారని మండిపడ్డారు ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ... విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన... కేజ్రీవాల్ ఘటనను సాకుగా చూపి ముఖ్యమంత్రుల సమావేశాన్ని చంద్రబాబు బహిష్కరిస్తారా? అని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు ఢిల్లీలో చేస్తున్న హడావిడి ఊరిలో పెళ్లికి కుక్కుల హడావిడిని తలపిస్తోందని సెటైర్లు వేశారాయన. ఏపీలో పరిపాలను గాలికి వదిలేశారని ఆరోపించిన కన్నా... రాష్ట్రంలో అత్యాచారాలు మితిమీరాయన్నారు. టీడీపీ నేతలు నిందితులకు అండగా నిలుస్తున్నారని విమర్శించిన ఆయన... వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన, బీజేపీ నేత ఆకులను పరామర్శించడానికి కలిశారని తెలిపారు.