కడప స్టీల్ ప్లాంట్‌ను మేం తెస్తాం...

కడప స్టీల్ ప్లాంట్‌ను మేం తెస్తాం...

కడప స్టీల్ ప్లాంట్‌ను మేం తెస్తాం... అందులో అనుమానాలు పెట్టుకోవద్దు... ఎవరూ డ్రామాలు ఆడాల్సిన అసరం లేదన్నారు బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ... ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సుప్రీంకోర్టుకు కేంద్రం ఎక్కడా కడప స్టీల్ ప్లాంట్ సాధ్యంకాదని చెప్పలేదన్నారు. ఏపీ సర్కార్ తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించకపోవడ వల్లే స్టీల్ ప్లాంట్ ఆలస్యం అవుతోందన్నారు కన్నా. రాష్ట్ర ప్రభుత్వం, మెకాన్ సంస్థ రెండు కలిసి సంయుక్తంగా “స్టీల్ ప్లాంట్ “ ఏర్పాటుకు సంబంధించిన సాధ్యసాధ్యాల నివేదికని త్వరగా అందజేస్తే కేంద్రం కూడా త్వరగా ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటుందన్నారు. తప్పుగా అర్థం చేసుకున్నారు... మరొకసారి అఫిడవిట్‌ని చదవాలని సూచించారాయన.

తెలుగుదేశం నేతలు నాటకాలు ఆపాలి... ఎవరూ ప్రాణత్యాగం చేయాల్సిన అవసరం లేదన్నారు కన్నా లక్ష్మీ నారాయణ... స్టీల్ ప్లాంట్ ఇస్తామని అమిత్ షా మాకు చెప్పారన్నారు. ఒకాయన స్టీల్ ప్లాంట్ కోసం ఆమరణ నిరాహారదీక్ష చేస్తానంటున్నాడు... మరొకాయన కేంద్రంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డ కన్నా... 2019లో తెలుగుదేశం మమ్మల్ని దోషిగా చూపి ఎన్నికలకు వెళ్లడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. తెలుగుదేశం సిగ్గు విడిచి... నిర్లజ్జగా ప్రజలను మోసం చేయడానికి యత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన... నాటకాలు ఆపి, తెలుగుదేశం... ప్రజలకు నిజాలు చెప్పాలని సూచించారు. కేంద్ర ఉక్కు శాఖ సుప్రీంకోర్టుకు ఇచ్చిన అపిడవిట్ లో చాలా స్పష్టంగా ఉంది... అఫిడవిట్ లో ఎక్కడా కేంద్ర ప్రభుత్వం ప్లాంట్ ఏర్పాటు చేయడం సాధ్య పడదు అని చెప్పలేదని తెలిపారు కన్నా లక్ష్మీనారాయణ. కొందరు తప్పుగా అర్థం చేసుకుని ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపించారని... తెలుగుదేశం నేతలు గాలి పోగేసి గోల చేస్తుంటారు... అది వారికి అలవాటే నని వ్యాఖ్యానించారు.