కొత్త ఎంపీలకు బీజేపీ అధిష్టానం పిలుపు..

కొత్త ఎంపీలకు బీజేపీ అధిష్టానం పిలుపు..

సార్వత్రిక ఎన్నికల్లో అద్భుత విజయాన్ని అందుకుంది భారతీయ జనతా పార్టీ... గతంలో కంటే ఎక్కువ సీట్లలో ముందంజలో ఉంది. ఇక కొత్త ఎన్నికైన ఎంపీలు ఈ నెల 25వ తేదీన ఢిల్లీకి రావాల్సిందిగా బీజేపీ అధిష్టానం పిలుపునిచ్చింది. ఢిల్లీలో ఈ నెల 25న బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించనున్నారు. పార్లమెంటరీ పార్టీ నేతగా ప్రధాని నరేంద్ర మోడీని ఎన్నుకోనున్నారు భారతీయ జనతా పార్టీ ఎంపీలు.