నిజామాబాద్‌లో వెనుకబడిన కవిత..

నిజామాబాద్‌లో వెనుకబడిన కవిత..

నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో నుంచి మరోసారి బరిలోకి దిగిన టీఆర్ఎస్ ఎంపీ, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కూతురు కె. కవిత... వెనుకబడ్డారు. ఈ స్థానంలో భారతీయ జనతా పార్టీ నుంచి బరిలోకి దిగిన ధర్మపురి అరవింద్... ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు. తొలి రౌండ్ ముగిసిన తర్వాత బీజేపీ అభ్యర్థి 18 వేల ఓట్ల తేడాతో ఆధిక్యంలో ఉన్నారు. కాగా, ఈ స్థానం నుంచి పెద్దసంఖ్యలో రైతులు పోటీ చేసిన సంగతి తెలిసిందే.