బీజేపీ అభ్యర్థి కంటతడి..

బీజేపీ అభ్యర్థి కంటతడి..

ఆరో విడత పోలింగ్‌ సందర్భంగా కూడా పశ్చిమ బెంగాల్‌లో పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు జరిగాయి. బీజేపీ, తృణమూల్‌ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. మరోవైపు పోలింగ్‌ ప్రారంభం కావడానికి కొన్ని గంటల ముందు ఝార్గామ్‌ జిల్లాలోని గోపీబల్లాబ్‌పూర్‌లో బీజేపీకి చెందిన బూత్‌ కన్వీనర్‌ రమణ్‌సింగ్‌ హత్యకు గురయ్యాడు. తృణమూల్ కార్యకర్తలే రమణ్‌సింగ్‌ను హత్య చేశారని బీజేపీ ఆరోపిస్తోంది. మరోవైపు ఇవాళ ఘటాల్‌ లోక్‌సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి భారతీఘోష్‌పై తృణమూల్‌ కాంగ్రెస్‌ మహిళా కార్యకర్తలు దాడికి యత్నించారు. పోలింగ్‌ కేంద్రాన్ని పరిశీలించేందుకు వెళ్లిన భారతిని అడ్డుకున్న టీఎంసీ కార్యకర్తలు.. ఆమెకు వ్యతిరేక నినాదాలు చేయగా.. ఆమె మరో పోలింగ్‌ కేంద్రానికి వెళ్లగా అక్కడ కూడా అదే పరిస్థితి ఎదురుకావడంతో కంటతడి పెట్టారు బీజేపీ అభ్యర్థి భారతిఘోష్‌.