'తెలంగాణకు రూ. 2.35 లక్షల కోట్లు ఇచ్చాం..'

'తెలంగాణకు రూ. 2.35 లక్షల కోట్లు ఇచ్చాం..'

తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఏం ఇచ్చిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అడుగుతున్నారు... పదేళ్ల కాలంలో యూపీఏ సర్కార్‌ తెలంగాణకి రూ.16,500 కోట్లు ఇస్తే.. ఐదేళ్ల కాలంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం తెలంగాణకు రూ.2 లక్షల 35వ వేల కోట్లు ఇచ్చిందని వెల్లడించారు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా... చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని శంషాబాద్‌లో బీజేపీ నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ... దేశ నలు మూలాల మోడీ, మోడీ అని వినిపిస్తోందన్నారు. ఎన్నికలకు ముందే తేలిపోయింది.. తర్వాతి ప్రధాని నరేంద్ర మోడీయేనని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్‌ కూడా చిన్నాచితక పార్టీలను కలుపుకొని పోత అంటున్నారని సెటైర్లు వేసిన అమిత్‌షా.. కేసీఆర్ పార్టీ కుటుంబ పార్టీ అని విమర్శలు గుప్పించారు. కేసీఆర్ తర్వాత టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎవరు? అనేది ఎవరిని అడిగిన చెబుతారని ఎద్దేవా చేసిన అమిత్‌షా.

ఇక అసదుద్దీన్ ఒవైసీకి భయపడి కేసీఆర్.. తెలంగాణ విమోచన దినాన్ని కూడా నిర్వహించడంలేదన్నారు అమిత్‌షా. తెలంగాణని రజాకార్ల నుండి విముక్తి చేయాలని పిలుపునిచ్చారు. గెలిచిన రెండున్నర నెలల వరకు కేబినెట్ ఏర్పాటు చేయలేదని కేసీఆర్‌పై సెటైర్లు వేశారు. మరోవైపు ఎందుకు ఎయిర్ స్ట్రైక్ చేశావని రాహుల్ గురువు శాం పిట్రోడా ప్రశిస్తున్నారు... ఒక్క బులెట్ అక్కడి నుండి వస్తే బులెట్ల వర్షం కురిపిస్తామని హెచ్చరించారు. రాహుల్, ఒవైసీతో కలిసి ఉన్న కేసీఆర్ లాంటివారు పాకిస్థాన్‌కి గట్టి సమాధానం చెప్పగలరా...? అని ప్రశ్నించారు అమిత్‌షా. చొరబాటు దారులను, అక్రమంగా వలస వచ్చిన వారిని దేశం నుండి తరిమేస్తామని స్పష్టం చేశారు.