ఎగ్జిట్ పోల్స్ జోష్‌: ఎన్డీఏ నేతల విందు..

ఎగ్జిట్ పోల్స్ జోష్‌: ఎన్డీఏ నేతల విందు..

సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ మరోసారి అధికారాన్ని దక్కించుకోనుంది.. అంటే, మరోసారి నరేంద్ర మోడీ ప్రధాని పీఠాన్ని అధిష్టించనున్నారు. ఎన్డీఏ కూటమి తిరిగి అధికారంలోకి రానుందంటూ వెలువడిన ఎగ్జిట్ పోల్స్‌ ఫలితాలతో ఆ కూటమిలో జోష్ పెరిగింది. తమ ప్రభుత్వమే మళ్లీ అధికారంలోకి వస్తుందని బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు, బీజేపీ కీలక నేతలంతా.. ఢిల్లీలోని పార్టీ హెడ్‌క్వార్టర్స్‌లో ఇవాళ సమావేశం కానున్నారు. అనంతరం ఇవాళ రాత్రి ఎన్డీఏ నేతలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా విందు ఇవ్వనున్నారు. ఈ విందు భేటీకి ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యే అవకాశాలున్నాయి. ఇక ఎన్డీఏలోని బిహార్‌ సీఎం, జేడీ(యూ) అధ్యక్షుడు నీతీష్‌ కుమార్‌, శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే, లోక్‌జనశక్తి పార్టీ అధ్యక్షుడు రామ్‌ విలాస్‌ పాసవాన్‌.. తదితర నేతలు హాజరుకానున్నారు.