బీజేపీ నేతలపై అమిత్‌షా ఫైర్...

బీజేపీ నేతలపై అమిత్‌షా ఫైర్...

తెలంగాణ బీజేపీ నేతలపై ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా తీవ్ర ఫైర్ అయ్యారు. హైదరాబాద్‌ పర్యటనలో ఉన్న ఆయన నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన పార్టీ పూర్తి సమయ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ... పార్టీ బలోపేతానికి సరైన చర్యలు చేపట్టడం లేదంటూ మండిపడ్డారు. బూత్‌ కమిటీల నియామకంలో జాతీయ పార్టీ రూపొందించిన మార్గదర్శకాలతో కాకుండా సొంత ఎజెండాతో ఎందుకు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన అమిత్‌షా... గతంలో చెప్పిన పనులు పూర్తి చేయకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. వచ్చే నెల 15వ తేదీ లోపు అన్ని పూర్తి చేయాలంటూ టార్గెట్ పెట్టారు బీజేపీ చీఫ్... అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో యాత్రలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రతి గ్రామాన్ని టచ్ చేయాలని బీజేపీ నేతలకు సూచించారు అమిత్‌షా... పార్టీ 23 మార్గదర్శకాలను పొందుపరచగా, రాష్ట్ర నేతలు 12 గైడ్‌లైన్స్‌కే వాటిని ఎందుకు కుదించారని ప్రశ్నించారు. బూత్‌ కమిటీల ఏర్పాటును వెంటనే పూర్తిచేయాలని ఆదేశించారు. గత పర్యటనలోనూ రాష్ట్ర బీజేపీ నేతలపై అమిత్‌షా ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.