కర్ణాటకలో క్లీన్‌స్వీప్‌ దిశగా బీజేపీ..!

కర్ణాటకలో క్లీన్‌స్వీప్‌ దిశగా బీజేపీ..!

సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ క్లీన్‌స్వీప్ దిశగా సాగుతోంది. 28 లోక్‌సభ స్థానాలున్న కర్ణాటకలో తాజా ట్రెండ్స్ ప్రకారం బీజేపీ అభ్యర్థులు 23 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా... కాంగ్రెస్ పార్టీ, జేడీ(ఎస్‌) రెండేసి స్థానాలకే పరిమితమయ్యారు. కాగా, జేడీఎస్-కాంగ్రెస్ సీట్ల షేరింగ్‌లో భాగంగా కాంగ్రెస్ 21 స్థానాల్లోనూ, జేడీఎస్ ఏడు సీట్లలో బరిలోకి దిగాయి. మరోవైపు 2014 ఎన్నికల్లో కర్ణాటకలో 17 లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించిన బీజేపీ... తాజా ట్రెండ్స్ ప్రకారం 23 సీట్లలో ఆధిక్యాన్ని కనబరుస్తోంది. ఇక మాజీ ప్రధాని దేవెగౌడ తుంకూరు నియోజకవర్గంలో వెనుకంజలో ఉన్నారు. మరోవైపు ఆయన మనుమడు నిఖిల్ కుమారస్వామి .. మాండ్య నియోజవర్గంలో వెనుకబడ్డారు.