జంప్ జిలానీలకు బిజెపి టిక్కెట్లు

జంప్ జిలానీలకు బిజెపి టిక్కెట్లు

ముందస్తు తెలంగాణ అసెంబ్లీ సీట్ల పంపకాల్లో బిజెపి వ్యూహాత్మకంగా ముందుకెళ్తుంది. తొలి నాలుగు లిస్టుల్లో ఎక్కువ శాతం పార్టీ అభ్యర్ధులకే టిక్కెట్లు ఇచ్చిన ఆ పార్టీ ,  ఐదో లిస్టు నుంచి ఇతర పార్టీల నుంచి వచ్చిన అభ్యర్ధులకే సీట్లు కట్టబెడుతుంది.  ఈరోజు 19మంది అభ్యర్ధులతో విడుదల చేసిన ఐదో లిస్టుతో కలిపి ఇప్పటి వరకు112 స్థానాలకి అభ్యర్థులను ప్రకటించింది. ఇంకా 7 స్థానాలను పెండింగ్ లో పెట్టింది. ఇందులో భువనగిరి,  యువ తెలంగాణ కి  ప్రకటించాల్సిన స్థానాలు, సికింద్రాబాద్ కంటోన్మెంట్, కుత్బుల్లాపూర్, పరిగి, మంచిర్యాల, బోధన్, నర్సాపూర్ స్థానాలు  కాసాని జ్ఞానేశ్వర్ కోసం రెండు స్థానాలు పెండింగ్ లో పెట్టింది. నిన్ననే కాంగ్రెస్ నుంచి బిజెపిలో చేరిన అరుణ తార కు జుక్కల్ టికెట్  కేటాయించింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానాన్ని ఓ కాంగ్రెస్ నేత కోసం పెండింగ్ లో పెట్టినట్లు సమాచారం.