మమతపై బీజేపీ ఫైర్‌

మమతపై బీజేపీ ఫైర్‌

పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జి ప్రభుత్వాన్ని వెంటనే బర్తరఫ్‌ చేయాలని బీజేపీ డిమాండ్‌ చేసింది. కోల్‌కతాలో నిన్న బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా రోడ్‌ సందర్భంగా ఘర్షణలు జరిగిన విషయం తెలిసిందే. టీఎంసీ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు పరస్పరం తీవ్రస్థాయిలో దాడులకు పాల్పడ్డారు. ఈ సందర్భంగా 19వ శతాబ్దపు  సామాజిక కార్యకర్త విద్యాసాగర్‌ విగ్రహాన్ని  ధ్వంసం చేశారు. దాడులు హింసాత్మకంగా మారడంతో పలుచోట్ల పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. మమతా ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఇవాళ ఢిల్లీలో బీజేపీ భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించింది. పశ్చిమ బెంగాళ్‌ శాంతి భద్రతలు లోపించాయని, అక్కడి ప్రభుత్వాన్ని వెంటనే బర్తరఫ్‌ చేయాలని బీజేపీ డిమాండ్‌ చేసింది.