మోడీని ఆపేందుకే టెంట్‌లు, ఫ్రంట్‌లు...

మోడీని ఆపేందుకే టెంట్‌లు, ఫ్రంట్‌లు...

ప్రధాని నరేంద్ర మోదీని ఆపేందుకు ప్రతిపక్షాలు టెంట్‌లు, ఫ్రంట్‌లు కడుతున్నాయిన మండిపడ్డారు భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌ మాధవ్... ప్రధానిగా నరేంద్ర మోడీ నాలుగేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి రామ్‌ మాధవ్‌తో పాటు, లక్ష్మణ్, కిషన్ రెడ్డి, ఎన్‌వీఎస్ఎస్ ప్రభాకర్, రాంచందర్ రావు తదితరులు హాజరయ్యారు... ఈ సందర్భంగా రామ్‌ మాధవ్ మాట్లాడుతూ.. రాజకీయాల్లో పార్టీలు ప్రజలకు జవాబుదారిగా ఉండాలన్నారు. నాలుగేళ్లలో బీజేపీ ప్రభుత్వం చేసింది ప్రజల ముందు పెడుతున్నామని... నాలుగేళ్ల తర్వాత కూడా మోడీ ప్రజాదరణలో ముందున్నారని అన్నారాయన. 

మోడీని ఎలా అపాలో... తెలియక విపక్షాలు ఆపసోపాలు ప డుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు రామ్‌ మాధవ్... మోడీ తెచ్చిన నూతన రాజకీయ ఒరవడిలో ఇమడ లేక పోతున్నారని... దాంతో కొందరు జంప్ అవుతున్నారని విమర్శించారాయన. మోడీని అవినీతిలోకి లాగే శక్తీ ఇప్పటి వరకు పుట్టలేదు, పుట్టబోదన్న రామ్‌ మాధవ్... బీజేపేతర పాలనలో ఉన్న రాష్ట్రాలు ఈ రాజకీయ సంస్కృతికి దూరంగా ఉన్నాయన్నారు. ఏపీలో మూడు, నాలుగేళ్లు సంసారం చేసి... ఇక మావళ్ల కాదని జంప్ అయ్యాడు... సముద్రంలో పడ్డాడంటూ చంద్రబాబుపై సెటైర్లు వేశారు రామ్‌మాధవ్... సీమాంధ్ర... స్కామాంధ్రగా మారనంత వరకు కేంద్ర ప్రభుత్వ సహకారం ఉటుందని స్పష్టం చేసిన ఆయన... ఇప్పటికే 80 శాతం హామీలు అమలు చేశామన్నారు. ఏపీలో కులతత్వం పెరిగిపోయిందని... అది వెంకటేశ్వర స్వామికి కులం  అంటగట్టే వరకు, అవినీతి గర్భగుడి వరకు వెళ్లిపోయిందని ఆరోపించారు.