ప్రత్యేక అతిథులుగా ఆ 50 మంది

ప్రత్యేక అతిథులుగా ఆ 50 మంది

రేపు జరుగునున్న నరేంద్ర మోడీ ప్రమాణస్వీకారానికి 50 మంది ప్రత్యేక అతిథులు హాజరుకానున్నారు. గురువారం రాత్రి రాష్ట్రపతి భవన్‌లో జరిగే  ప్రమాణా స్వీకారానికి పొరుగు దేశాల అధిపతులతో పాటు పలు   రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, భాజపా అగ్రనేతలు హాజరుకానున్నారు. వీరితో పాటు దేశ వ్యాప్తంగా పార్టీ కోసం పోరాడుతూ మృతి చెందిన 50 మంది కార్యకర్తల కుటుంబ సభ్యులను కూడా ఆహ్వానించారు.  వీరిలో అధిక శాతం మంది పశ్చిమబెంగాల్‌కు చెందినవారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ప్రమాణ స్వీకార తేదీ ఖరారైన తరవాత మోడీ, పార్టీ అధ్యక్షుడు అమిత్ షా మధ్య జరిగిన చర్చలో... కార్యకర్తల కుటుంబాలను ఆహ్వానించాలన్న నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.  వీరందరినీ  ‘ప్రత్యేక ఆహ్వానితుల’ జాబితాలో చేర్చి... రాష్ట్రపతి భవన్‌కు అందజేస్తున్నారు.