తెలంగాణలో 4 స్థానాల్లో బీజేపీ ముందంజ..

తెలంగాణలో 4 స్థానాల్లో బీజేపీ ముందంజ..

తెలంగాణ ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావాన్ని చూపించలేకపోయిన భారతీయ జనతా పార్టీ... లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం ముందంజలో ఉన్నారు. తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు గాను... నాలుగు స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. సికింద్రాబాద్‌ స్థానం నుంచి కిషన్‌రెడ్డి 15వేల ఓట్ల ఆధిక్యంలో ఉండగా.., నిజామాబాద్‌ నుంచి ధర్మపురి అరవింద్‌ 18 వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. కరీంనగర్‌లో బీజేపీ అభ్యర్థి 30 వేల ఓట్లకు పైగా ఆధిక్యంతో ముందంజలో ఉన్నారు. ఆదిలాబాద్‌లోనూ బీజేపీ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారు. ఇక ఎంఐఎం కంచుకోటగా భావించే హైదరాబాద్ పార్లమెంట్ స్థానంలోనూ ఓ సారి ఆధిక్యాన్ని ప్రదర్శించింది భారతీయ జనతా పార్టీ.