మద్యం అక్రమ రవాణా కేసులో ఏపీ బీజేపీ నేత అరెస్ట్

మద్యం అక్రమ రవాణా కేసులో ఏపీ బీజేపీ నేత అరెస్ట్

 తెలంగాణ నుంచి ఏపీ కి అక్రమంగా తరలిస్తున్న 40 మద్యం కేసులను ఎస్.ఈ.బి అధికారులు సీజ్ చేశారు. నల్గొండ చిట్యాల నుంచి గుంటూరు నగరానికి మద్యం తరలిస్తున్న నలుగురు వ్యక్తులను కూడా అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి 40 కేసుల మద్యాన్ని, మూడు ఖరీదైన కారులను కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఎస్.ఈ.బి అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.  ]రూ.6లక్షలు విలువైన 1,920 మద్యం సీసాలు, 3 కార్లు స్వాధీనం చేసుకున్నారు. గుడివాక రామాంజనేయులు, మచ్చా సురేశ్‌, కె. నరేశ్‌, గంటా హరీశ్‌ లను అరెస్ట్‌ చేయగా రామాంజనేయయులను ఏ-1గా పేర్కొన్నారు. 2019లో మచిలీపట్నం భాజపా ఎంపీ అభ్యర్థిగా రామాంజనేయులు పోటీ చేశారు. దీంతో మద్యం అక్రమ రవాణా కేసులో పట్టబడిన బిజేపి నేత పై చర్యలు తీసుకుంది పార్టీ. గుడివాడ అంజిబాబును బిజేపి నుంచి సోము వీర్రాజు  సస్పెండ్ చేశారు.