కిషన్ రెడ్డికి మాతృవియోగం

కిషన్ రెడ్డికి మాతృవియోగం

బీజేపీ సీనియర్ నేత జీ. కిషన్ రెడ్డి తల్లి గంగాపురం ఆండాలమ్మ అనారోగ్యంతో మృతి చెందారు. హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె బుధవారం అర్ధరాత్రి కన్నుమూశారు. గురువారం ఉదయం 9గంటలకు ఆండాలమ్మ పార్ధివదేహాన్ని రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపూర్ గ్రామానికి తరలించనున్నారు. మధ్యాహ్నం 3గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అండాలమ్మ మృతిపట్ల పలువురు బీజేపీ నేతలు సంతాపం తెలిపారు.