బండి సంజయ్ ని తిట్టి కేసీఆర్ కు దగ్గర కావాలని చూస్తున్నారు...

బండి సంజయ్ ని తిట్టి కేసీఆర్ కు దగ్గర కావాలని చూస్తున్నారు...

టీఆర్ఎస్ నేతలు తాగి మాట్లాడుతున్నట్టు ఉన్నారు. నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు మీకు సిగ్గు ఉందా. టీఆర్ఎస్ కు రోజులు దగ్గర పడ్డాయి అని బీజేపీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొప్పు బాషా అన్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ ఎమ్మెల్యే ల పై డ్రగ్స్ ఆరోపణలు వస్తున్నాయి. వామన రావు హత్య ఉదంతం తర్వాత పుట్ట మధు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. త్వరలోనే పుట్ట మధు జైల్ కు పోతాడు. పుట్ట మధు తెల్లారితే ఎవరిని మర్డర్ చేయాలా?ఎక్కడ భూ కబ్జాలు చేయాలా అని చూస్తారు. పుట్ట మధు, పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ పెద్ద వసూల్ గాడు అని అన్నారు. నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు దమ్ముంటే ప్రగతి భవన్ వెళ్లి కేసీఆర్ ను అడగండి. కేసీఆర్ కు ,కేటీఆర్ కు మూతి మీద మీసాలు కూడా లేవు మీరు కూడా సంజయ్ గురించి మాట్లాడుతారా అని అడిగిన ఆయన కేసీఆర్ దగ్గరకు రానివ్వకపోవడం వల్లే బండి సంజయ్ ని తిట్టి కేసీఆర్ కు దగ్గర కావాలని చూస్తున్నారు అని తెలిపారు.