కల్వకుంట్ల రాజ్యాంగం కాదు.. ఇది అంబేద్కర్ రాజ్యాంగం

కల్వకుంట్ల రాజ్యాంగం కాదు.. ఇది అంబేద్కర్ రాజ్యాంగం

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్‌పై బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ ఫైర్‌ అయ్యారు. కల్వకుంట్ల రాజ్యాంగం కాదు.. ఇది అంబేద్కర్ రాజ్యాంగమని... ఎన్నికల కమిషన్ ని ప్రభుత్వం తన గుప్పెట్లో పెట్టుకుందని మండి పడ్డారు.  రాష్ట్ర ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందో ప్రజలు గమనిస్తున్నారని...   గ్రేటర్ ఎన్నికలో ఎలాగైనా గెలవాలని కుట్ర చేసిందన్నారు. బీజేపీ... టీఆర్‌ఎస్‌తో పాటు, ఎన్నికల సంఘం, పోలీసులతో పోరాటం చేసిందని..ఈ పోరాటంలో ప్రజలు బీజేపీ కి పట్టం కట్టారని స్పష్టం చేశారు.  కేసీఆర్ రాజీనామా చేయాల్సింది పోయి.... కొత్త కౌన్సిల్ ను కూడా ఏర్పాటు చేయడం లేదన్నారు. అంబేద్కర్ పట్ల ఏ మాత్రం గౌరవం ఉన్న కొత్త కౌన్సిల్ ను ఏర్పాటు చేయాలని..రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తే సహించేది లేదని ఫైర్‌ అయ్యారు. గ్రేటర్‌ ఎన్నికలకు గడువు ఉంటే టీఆర్‌ఎస్‌కి ఒక్క సీటు కూడా రాకపోవని... టీఆర్‌ఎస్‌, మజ్లీస్ లు హైదరాబాద్ ని దోచుకున్నాయని మండిపడ్డారు. దోచుకున్నది మొత్తం బీజేపీ కార్యకర్తలు కక్కిస్తారని..  అవసరం అయితే ప్రగతి భవన్ ని ముట్టడిస్తామని హెచ్చరించారు. భవిష్యత్ లో ktr సీఎం అయ్యే అవకాశం లేదని.. దొడ్డిదారిన సీఎంని చేయాలని చూస్తున్నాడన్నారు. కేటీఆర్‌ను సీఎం చేస్తే టీఆర్‌ఎస్‌లో సంక్ష్సోభం రావడం ఖాయమని హెచ్చరించారు.