లక్ష్మణ్‌ దీక్ష కొనసాగుతోంది.. బంద్‌ విజయవంతం చేయండి..

లక్ష్మణ్‌ దీక్ష కొనసాగుతోంది.. బంద్‌ విజయవంతం చేయండి..

ఇంటర్ ఫలితాల్లో జరిగిన అవకతవకలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ నిరహారదీక్షకు దిగిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ను ఆస్పత్రికి తరలించినా... ఆయన నిమ్స్‌లో దీక్ష కొనసాగిస్తూనే ఉన్నారు. మరోవైపు రేపు రాష్ట్ర బంద్‌కు పిలునిచ్చింది బీజేపీ. 9 లక్షల విద్యార్థులు కుటుంబాలకు తెలంగాణ సమాజం ఇచ్చే భరోసాగా రేపటి బంద్ ని దిగ్విజయం చేయాలని పిలుపునిచ్చారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు.. మా నాయకులను, కార్యకర్తలని అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డ ఆయన... ప్రభుత్వం బంద్ ని విఫలం చేసేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని ఆరోపించిన బీజేపీ నేత... ఎన్ని అడ్డంకులు సృష్టించినా బంద్ నిర్వహించి తీరుతాం.. అన్ని సంఘాలు మద్దత్తు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రేపటి బంద్ తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు మురళీధర్‌రావు.