మరో బీజేపీ సీనియర్ నేతకి అస్వస్థత...ఆసుపత్రిలో మురళీమనోహర్ జోషి !

మరో బీజేపీ సీనియర్ నేతకి అస్వస్థత...ఆసుపత్రిలో మురళీమనోహర్ జోషి !

వరుసగా బీజేపీ నేతలు ఆసుపత్రి పాలవుతున్నారు. తాజాగా బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి ఆసుపత్రి పాలవడం బీజేపీ వర్గాల్లో ఆందోళనకి కారణం అయ్యింది. కాన్పూర్ లోని తన నివాసంలో ఈరోజు మధ్యాహ్నం ఆయన అస్వస్థతకు గురికావడంతో ఆసుపత్రికి తరలించారని అంటున్నారు. ప్రస్తుతం ఆయనకు కాన్పూర్ లోని రీజెన్సీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్టు సమాచారం. మురళీ మనోహర్ జోషి బీజేపీ వ్యవస్థాపకుల్లో ఒకరు, అయితే మొన్నటి ఎన్నికల్లో మాత్రం వయో నిబంధన కారణంగా పోటీకి దూరంగా ఉన్నారు. అయితే ఆయన ఆరోగ్యానికి సంబందించి మరింత సమాచారం అందాల్సి ఉంది.