ప్రభాస్ సాహో సెట్స్ లో బీజేపీ సీనియర్ నేత

ప్రభాస్ సాహో సెట్స్ లో బీజేపీ సీనియర్ నేత

ప్రభాస్ హీరోగా చేస్తున్న సాహో సినిమా షూటింగ్ ప్రస్తుతం ముంబై నగరంలో జరుగుతున్న సంగతి తెలిసిందే.  ఈ షెడ్యూల్ తో సినిమా మొత్తం పూర్తవుతుంది.  అనంతరం నిర్మాణాంతర కార్యక్రమాలు మొదలు పెట్టి ఆగష్టు 15 వ తేదీన రిలీజ్ చేయబోతున్నారు.  బాహుబలి సిరీస్ తరువాత ప్రభాస్ చేస్తున్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి.  

ఇదిలా ఉంటె, ఈ సినిమా సెట్స్ లోకి అనుకోని అతిధి రావడంతో సందడిగా మారింది.  అదెవరో కాదు... బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ.  సెట్స్ లో ప్రభాస్ ను, ఇతర టీమ్ యూనిట్ ను కలిసి కాసేపు ముచ్చటించారు.  ఈ సందర్భంగా తీసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.