కూకట్ పల్లిలో పురందేశ్వరి రోడ్ షో

కూకట్ పల్లిలో పురందేశ్వరి రోడ్ షో

కూకట్‌పల్లిలో ఎన్నికల ప్రచార పర్వం జోరుగా సాగుతుంది. బీజేపీ అభ్యర్థి మాధవరం కాంతారావుకు మద్దతుగా కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత దగ్గుబాటి పురందేశ్వరి రోడ్ షో నిర్వహించారు. వసంత్ నగర్ నుంచి మూసాపేట్ వరకు సాగిన ప్రచారంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా పురందేశ్వరి ప్రసంగిస్తూ.. టీఆర్ఎస్‌పై, మహాకూటమి పార్టీలపై నిప్పులు చెరిగారు. చిన్నపాటి వర్షం పడితే పడవలు వేసుకొని వెళ్లే పరిస్థితి కూకట్‌పల్లిలో నెలకొందన్నారు. డ్రైనేజ్‌ నుంచి మురుగు నీరు ఇళ్లలోకి వస్తుందోన్నారు. ఇటువంటి పరిస్థితిని ఏ విధంగా విశ్వనగరంలో భాగంగా చూడాలని తాజామాజీ ఎమ్మెల్యే మాధవరం కృష్టారావును, టీఆర్ఎస్‌ను ఆమె ప్రశ్నించారు. ప్రధాని మోడీని ఓడించాలనే భావసారూప్యత లేని పార్టీలు ఒకచోట చేరాయన్నారు. రాష్ట్రంలో కూడా అవినీతి లేని అభివృద్ధి కావాలంటే కమలం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు పురందేశ్వరి విజ్ఞప్తి చేశారు.