బీజేపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి

బీజేపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి

మాజీ మంత్రి, బీజేపీ మహిళా నేత  పుష్పలీల బీజేపీకి రాజీనామా చేశారు. పార్టీ అవలంభిస్తున్న విధి విధానాలు నచ్చక రాజీనామా చేసినట్లు ప్రకటించారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఆర్ఎస్ఎస్ చేతిలో బీజేపీ కీలుబొమ్మ అని, పార్టీ లో మహిళలను, దళితులను చులకన భావంతో చూస్తున్నారని ఆమె ఆరోపించారు. బీజేపీ విధానాలు నచ్చకనే ఆ పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌లో చేరుతున్నట్టు ఆమె ప్రకటించారు.తెలంగాణ ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌దేనన్నారు. టీఆర్‌ఎస్‌ను గద్దె దించడానికే కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు తెలిపారు.