'చంద్రబాబు రాజకీయం చూస్తుంటే జాలేస్తుంది'

'చంద్రబాబు రాజకీయం చూస్తుంటే జాలేస్తుంది'

టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు రాజకీయం చూస్తుంటే జాలేస్తుందని ఏపీ బీజేపీ నేత సోము వీర్రాజు అన్నారు. ఈ రోజు ఆయన విశాఖలో మాట్లాడుతూ... ప్రధాని మోడీని ఓడించాలని చంద్రబాబు పనిగా పెట్టుకున్నారు. అందుకు కమ్యూనిస్టులను ఒక వైపు, మరోవైపు హీరో శివాజీని వదిలాడు. చంద్రబాబు రాజకీయం చూస్తుంటే జాలేస్తుందన్నారు. చంద్రబాబుకు మతి, గతి తప్పింది. చంద్రబాబు దిగజారిపోయి జీరో అయిపోయాడన్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఖచ్చితంగా ఓడిపోతాడని సోము వీర్రాజు జోస్యం చెప్పారు. ఏపీ అభివృద్ధికి బీజేపీనే సహయం చేసిందన్నారు.  

కొడుకుని ముఖ్యమంత్రి చేయ్యడం తప్ప సీఎం చంద్రబాబుకు వేరే ఆలోచన లేదని సోము వీర్రాజు మండిపడ్డారు. లాడ్జిలకు, బంగ్లాలకు కోట్లు ఖర్చు పెట్టారన్నారు. చంద్రబాబు నాయుడు హయాంలో మంత్రి గంటా శ్రీనివాస్ రావు విద్య కోసం 1.25 కోట్లు ఖర్చు పెట్టారు కానీ.. ఏపీలో విద్య మాత్రం ప్రైవేటు స్కూళ్ళులో దొరుకుతుందని ఎద్దేవా చేశారు. గంటా అక్రమంగా సంపాదించుకున్న సొమ్ము విష్ణుకుమార్ రాజుపై గెలవడానికి ఉపయోస్తాడని విమర్శించారు. స్కూల్ యూనిఫామ్ పేరుతో 200 కోట్లు దోచుకున్నారు. ఏపీలో విద్య సంకనాకి పోయిందని సోము వీర్రాజు పేర్కొన్నారు.