చంద్రబాబు రెండేళ్లలో జైలుకెళ్లకు తప్పదు..!

చంద్రబాబు రెండేళ్లలో జైలుకెళ్లకు తప్పదు..!

గత ప్రభుత్వం చేసిన అవినీతిని వైఎస్ జగన్ సర్కార్ వెలికి తీయాలి.. అవినీతికి పాల్పడిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చే రెండేళ్లల్లో జైలుకెళ్లక తప్పదు అన్నారు భారతీయ జనతా పార్టీ, ఏపీ ఇంఛార్జ్ సునీల్ దేవ్రా... బీజేపీలో చేరిన తర్వాత రాజ్యసభ సభ్యులు సుజనాచౌదరి తొలిసారి రాష్ట్రానికి వచ్చిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ముక్త్ భారత్ నినాదాన్ని ఇప్పుడు బీజేపీ వినిపిస్తోందన్నారు. ఇదే నినాదాన్ని ఎన్టీఆర్.. ఏపీలో వివిపించి సక్సెస్ అయ్యారన్న ఆయన.. ఎన్టీఆరుకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. అబద్దాలతో బీజేపీని ఏపీలో చంద్రబాబు దెబ్బ తీసే ప్రయత్నం చేశారని సునీల్ దేవ్రా ఫైర్ అయ్యారు. చంద్రబాబు అదే పనిగా బీజేపీని టార్గెట్ చేశారు కాబట్టే.. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిందన్నారు. కాగా, రాబోయే రోజుల్లో ఏపీలో బీజేపీనే ప్రధాన ప్రతిపక్షం కాబోతోందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. 

ఇక ఆంధ్రప్రదేశ్‌లో కులరహిత రాజకీయాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు బీజేపీ ఏపీ ఇంఛార్జ్ సునీల్ దేవ్రా.. బీజేపీ ఏ ఒక్క కులానికో చెందిన పార్టీ కాదని స్పష్టం చేసిన ఆయన.. కులరహిత రాజకీయాలనే బీజేపీ ఏపీలో ప్రోత్సహిస్తోందని ప్రకటించారు. సుజనా చౌదరి నేతృత్వంలో బీజేపీ ఏపీలో బలపడుతోందనే విశ్వాసాన్ని వ్యక్తం చేసిన ఆయన.. త్వరలోనే కాంగ్రెస్, టీడీపీకి చెందిన నేతలు బీజేపీలో చేరబోతున్నారని తెలిపారు.