రాముల‌మ్మ ఫైర్.. కేసీఆర్‌, జానారెడ్డిపై ఇలా...!

రాముల‌మ్మ ఫైర్.. కేసీఆర్‌, జానారెడ్డిపై ఇలా...!

నాగార్జున సాగ‌ర్ ఉప ఎన్నిక‌ల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు బీజేపీ నేత విజ‌య‌శాంతి.. క‌ల్వ‌కుంట్ల వాళ్ల‌కు స‌వాల్ చేయ‌డ‌మే త‌ప్ప చ‌ర్చ‌కు వ‌చ్చే ద‌మ్ముం లేద‌న్నారు. అధికార దుర్వినియోగానికి పాల్ప‌డి సాగ‌ర్ ఉప ఎన్నిక‌ల్లో.. టీఆర్ఎస్ గెల‌వాల‌ని చూస్తుంద‌న్న ఆమె.. టీఆర్ఎస్ ఏం చేయ‌లేదు కాబ‌ట్టి.. బీజేపీకి ప్ర‌జ‌లు ఓట్లు వేయాలి.. సీఎం కేసీఆర్ ఎక్క‌డా క‌న‌బ‌డ‌డు కాబ‌ట్టి బీజేపీకి ఓటు వేయాల‌న్నారు.. చావు నోట్లో తల పెట్టి తెలంగాణ తెచ్చానంటున్న కేసీఆర్... తెలంగాణ ప్రజలను చావుకు దగ్గర చేశారని మండిపడ్డారు. తెలంగాణ వచ్చాక రాష్ట్రాన్ని కేసీఆర్ అనాథాశ్రమంగా మార్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు ఒక్కటేనన్నారు. ఆ పార్టీలకు ప్రత్యామ్నాయంగా బీజేపీ అభ్యర్థికి ఓటేసి గెలిపించాలని రాములమ్మ పిలుపునిచ్చారు. మంచివాళ్లు అంటే.. బీజేపీవాళ్లే కానీ, టీఆర్ఎస్ నేత‌లు కాద‌న్నారు.. కేంద్రం ఇచ్చే నిధుల‌ను కూడా ప‌క్క‌దారి ప‌ట్టించి.. ప్ర‌జ‌ల‌కు అంద‌కుండా కుట్ర చేశార‌ని మండిప‌డ్డారు.. ఇంకా రాముల‌మ్మ ఎన్టీవీతో ఏం మాట్లాడిందో తెలుసుకోవ‌డానికి కింది వీడియోను క్లిక్ చేయండి..