ఏపీ దోపిడీకి గురైంది: విష్ణు కుమార్ రాజు

ఏపీ దోపిడీకి గురైంది: విష్ణు కుమార్ రాజు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దోపిడీకి గురైందని బీజేపీ నేత విష్ణు కుమార్ రాజు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఆయన విశాఖలో మాట్లాడుతూ... ముఖ్యమంత్రి చంద్రబాబు అవినీతి పరిపాలన అందించారు. ఇసుక నుండి మట్టి దాక అంత దందానే.. ఏపీ దోపిడీకి గురైందన్నారు. గంటా ఏపీలో విద్యను సర్వనాశనం చేసారు. ఈ ఎలక్షన్ లో గంటా ఓడిపోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. గంటా పార్టీ మారుతారని అనుకున్నా.. ఇంకా సమయం ఉంది కాబట్టి మారినా ఆశ్చర్యం పడనవసరం లేదన్నారు. గంటా భూములు దోచెయ్యడంలో నెంబర్ వన్. ఉత్తర నియోజికవర్గంలో పార్టీ మధ్య పోటీ కాదు.. నీతికి, అవినీతి మధ్య పోటీ అని విష్ణు కుమార్ రాజు పేర్కొన్నారు. 

ఇప్పటికే ఓట్లుకు డబ్బులు పంపిణీ చేస్తున్నారని సమాచారం అందింది. ఈ రోజుల్లో ముష్టివాడు కుడా 5 రూపాయిలు కన్నా తక్కువ వేస్తే తీసుకోవడం లేదు.. మరి ఓటుకు డబ్బు తీసుకునే వారు రోజుకు ఎంత అవుతుందో తెలుసుకోండని విష్ణు కుమార్ రాజు అన్నారు. హుదుద్ ఇళ్ళను కుడా గంటా వర్గం అమ్ముకుంది. గంటాకు కనీస మానవత్వం కుడా లేదన్నారు. బీజేపీ, జనసేన, వైసీపీ పార్టీలు గంటాకు నో ఎంట్రీ బోర్డు పెట్టడంతో సచ్చినట్లు టీడీపీలో ఉన్నారని విమర్శించారు.