వారిది పని తక్కువ ప్రచారం ఎక్కువ...

వారిది పని తక్కువ ప్రచారం ఎక్కువ...

తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానిది, నేతలది పని తక్కువ... ప్రచారం ఎక్కువ అని విమర్శించారు ఆంధ్రప్రదేశ్ బీజేఎల్పీ నేత విష్ణుకుమార్ రాజు... విజయవాడలో బీజేపీ కోర్ కమిటీ సమావేశం ముగిసిన తర్వాత ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన... అవాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లటంలో దేశంలో టీడీపీ నంబర్ వన్ అంటూ మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వం డబ్బులు వెచ్చించి సోషల్ మీడియాలో మాపై విషప్రచారం చేస్తున్నట్టు గుర్తించామని వెల్లడించిన విష్ణుకుమార్ రాజు... రాష్ట్రానికి కేంద్రం చేసిన సాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లటంలో మేం విఫలమయ్యామని ఒప్పుకున్నారు. ఇక కాపుల రిజర్వేషన్లపై కూడా చంద్రబాబు రాజకీయం చేస్తున్నారన్న బీజేఎస్పీ నేత... ఆయనకి వచ్చిందే అది అంటూ సెటైర్లు వేశారు. కేంద్రం ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదని పిల్ల చచ్చిన కోతిలా చంద్రబాబు గోల చేస్తున్నారని వ్యాఖ్యానించిన విష్ణుకుమార్ రాజు... ప్రభుత్వం చెబుతున్న అవాస్తవాలను ప్రచారం చేస్తున్న మీడియా ఈ ప్రభుత్వం శాశ్వతం కాదని తెలుసుకోవాలని... ప్రజల మైండ్‌ను మీడియా కరప్ట్ చేయలేదన్నారు.