2024 నాటికి ఏపీలో టీడీపీ పార్టీ ఉండదు..

2024 నాటికి ఏపీలో టీడీపీ పార్టీ ఉండదు..

బీజేపీ రాష్ట్ర నాయకులు తెలుగుదేశంపై విరుచుకుపడ్డారు. 2024 నాటికి ఏపీలో టీడీపీ పార్టీ ఉండదని బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు తెలిపారు. అమరావతిలో బీజేపీ నాయకులు మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో టీడీపీ ఏ విధంగా భూస్థాపితమైందో ఏపీలో కూడా అదే పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. టీడీపీ కెప్టెన్ లేని షిప్ లాంటిదని ఎద్దేవా చేశారు. టీడీపీలోని ముఖ్యనేతలంతా మాకు టచ్ లో ఉన్నారని తెలిపారు. మేము డోర్లు తెరిస్తే టీడీపీ అంతా బీజేపీలోనే ఉంటుందని అన్నారు. చంద్రబాబు ఉద్దేశ్యపూర్వకంగానే బీజేపీపై దుష్ప్రచారం చేశారని విష్ణుకుమార్ రాజు ఆరోపించారు. 

ఏపీలో టీడీపీ నాయకత్వం పై కార్యకర్తలకు విశ్వాసం సన్నగిల్లిందని, అందుకే చాలా మంది నాయకులు బీజేపీలో చేరడానికి సిద్దంగా ఉన్నారని బీజేపీ మహిళా నాయకురాలు, మాజీ ఎంపీ పురందేశ్వరి అన్నారు. 'మోడీ విధానాలు నచ్చి మా పార్టీలో చేరుతున్నారు. మేము ఎవర్నీ ఆహ్వానించడం లేదు. చేరతామని వచ్చిన వారిని వద్దనేది లేదు. ఎవరైనా సరే వారి పదవులకి రాజీనామా చేశాకే పార్టీలో చేరాలి. టీడీపీ కావాలనే బీజేపీపై దుష్ప్రచారం చేసింది. ఏపీకి బీజేపీ ఏమీ చేయలేదంటూ తప్పుడు ప్రచారం చేశారు' అని పురందేశ్వరి అన్నారు.