సోషల్ మీడియా: హెయిర్ స్టైల్ హీరోలు బీజేపీ నేతలు

సోషల్ మీడియా: హెయిర్ స్టైల్ హీరోలు బీజేపీ నేతలు

సోమవారం దేశంలోనే సుప్రసిద్ధ కేశాలంకరణ వ్యాపారవేత్త జావెద్ హబీబ్ బీజేపీలో చేరారు. ఆయన కంపెనీ దేశవ్యాప్తంగా 110 నగరాల్లో 846 హెయిర్ అండ్ బ్యూటీ సెలూన్లను నడుపుతోంది. పార్టీలో చేరగానే అధికార పార్టీ ఎన్నికలకు ముందు ప్రారంభించిన 'మై భీ చౌకీదార్' నినాదాన్ని జావెద్ హబీబ్ కూడా అంది పుచ్చుకున్నారు. 'ఇవాళ్టి వరకు నేను జుత్తుకు కాపలాదారుగా ఉన్నాను. ఇప్పుడు దేశానికి కాపలాదారుడిని అయ్యానని' హబీబ్ చెప్పారు.

బీజేపీలో హబీబ్ ను చేర్చుకోగానే సోషల్ మీడియాలో మెమెల వరద వెల్లువెత్తింది. పార్టీ అగ్రనేతలందరూ ట్రెండీ హెయిర్ స్టైళ్లలో కనిపించారు. వీటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా కలిసి ఉన్న ఫోటో.

ఇతర బీజేపీ నేతలకు కూడా ట్విట్టర్ యూజర్లు తమదైన శైలిలో మేకోవర్ చేశారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ లకు లేటెస్ట్ ఫ్యాషన్ అనుసరించి జుత్తు స్టైలింగ్, కలరింగ్ ఇచ్చారు.

బీజేపీని అన్ని వేదికలపైనా బలంగా వెనకేసుకొచ్చే బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కి కూడా ట్రీట్ మెంట్ లభించింది. 

వీటితో సరిపెట్టకుండా హబీబ్ బీజేపీలో ఎందుకు చేరారంటే.. అంటూ ట్విట్టర్, ఫేస్ బుక్ లలో పంచ్ లు విసురుతున్నారు.