దేశవ్యాప్తంగా కమలం గాలి

దేశవ్యాప్తంగా కమలం గాలి

17 వ లోక్ సభ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది.  ఈ ఎన్నికల్లో బీజేపీ దూసుకుపోతున్నది.  ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా అందిన సమాచారం ప్రకారం బీజేపీ 159 స్థానాల్లో లీడింగ్ లో ఉన్నట్టు తెలుస్తోంది.  నార్త్ ఇండియాలో పంజాబ్ మినహా మిగతా రాష్ట్రాల్లో బీజేపీ దూసుకుపోతున్నది.  పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీ లీడింగ్ లో ఉండటం విశేషం.  అటు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ లీడింగ్ లో ఉంది.  

ఇదిలా ఉంటె, కేరళలో బీజేపీ హవా సాగబోతున్నది.  ఇప్పటికే కొన్ని చోట్ల లీడింగ్ లో ఉన్నది.  తెలంగాణాలో మూడు స్థానాల్లో బీజేపీ లీడింగ్ లో ఉండటం విశేషం.  పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోనూ బీజేపీ లీడింగ్ లో ఉన్నట్టు కనిపిస్తోంది.  ఇదే హవా మిగతా రౌండ్లలోను కనిపిస్తే ఈజీగా ఎన్డీఏ 300 లకు పైగా స్థానాలు కైవసం చేసుకుంటుంది అనడంలో సందేహం లేదు.