బీజేపీ ఎగ్జిట్ పోల్స్ ను మ్యానేజ్ చేసింది

బీజేపీ ఎగ్జిట్ పోల్స్ ను మ్యానేజ్ చేసింది

భారతీయ జనతా పార్టీ ఎగ్జిట్ పోల్స్ ను మ్యానేజ్ చేసిందని కాంగ్రెస్ శాసనసభ పక్షనేత భట్టి విక్రమార్క ఆరోపించారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ఆయనతో పాటు కాంగ్రెస్ నేతలు చిన్నారెడ్డి, వంశీచంద్ రెడ్డి హజరయ్యారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. లౌకికవాదంతో కాంగ్రెస్ ముందుకు వెళుతుందని తెలిపారు. దేశంలో అన్ని మతాలు కలిసి మెలసి ఉండేందుకు కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ లో విలీనం అవుతుందని బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ వ్యాఖ్యానించడం ఆయన అవగాహనా రాహిత్యమేనని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర తెలంగాణలో కొనసాగుతుందని భట్టి పేర్కొన్నారు.