రైతులందరికీ పీఎం-కిసాన్ పథకం: బీజేపీ మేనిఫెస్టో

రైతులందరికీ పీఎం-కిసాన్ పథకం: బీజేపీ మేనిఫెస్టో

బీజేపీ తన మేనిఫెస్టో 'సంకల్ప్ పత్ర్'లో రైతులపై ప్రత్యేక దృష్టి పెట్టింది. మోడీ ప్రభుత్వం రైతులకు ఆర్థిక సాయం ఇస్తూ ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం (పీఎం-కిసాన్)ప్రయోజనాన్ని రైతులందరికీ వర్తింపజేస్తామని ప్రకటించింది. ఫిబ్రవరి 24న గోరఖ్ పూర్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇది దేశంలోని 12 కోట్ల రైతు కుటుంబాలకు ప్రయోజనం చేకూరుస్తుందని చెప్పారు. కానీ ఇప్పుడు పార్టీ తాము తిరిగి అధికారంలోకి వస్తే దీనిని విస్తరించి అన్ని రైతు కుటుంబాలకు వర్తింపజేస్తామని తెలిపింది. దేశంలో సుమారుగా 14 కోట్ల రైతు కుటుంబాలు ఉన్నాయి. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చింది. అసలును కచ్చితంగా చెల్లించినవారికి 1-5 ఏళ్ల కాలానికి 0% వడ్డీ రేటుకు రూ.1 లక్ష వరకు స్వల్పకాలిక కొత్త వ్యవసాయ రుణాలను అందిస్తామని తెలిపింది. వ్యవసాయ రంగం ఉత్పాదకత పెంచేందుకు రూ.25 లక్షల కోట్లు పెట్టుబడి పెడతామని వాగ్దానం చేసింది. 60 ఏళ్ల వయసున్న సన్న, చిన్నకారు రైతులకు పెన్షన్ ఇస్తామని ప్రకటించింది.