తెలంగాణపై ఫోకస్‌.. ఢిల్లీలో బీజేపీ కీలక భేటీ

తెలంగాణపై ఫోకస్‌.. ఢిల్లీలో బీజేపీ కీలక భేటీ

తెలంగాణపై ఫోకస్‌ పెట్టిన బీజేపీ అధిష్టానం ఇవాళ రాష్ట్ర నేతలతో కీలక సమావేశం నిర్వహించింది. ఢిల్లీలో జరిగిన ఈ భేటీకి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్‌, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యే రాజాసింగ్‌ తదితరులు హాజరయ్యారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జేపీ నడ్డా.. తెలంగాణ నేతలకు కీలక సూచనలిచ్చారు. తెలంగాణలో తాజా రాజకీయ పరిస్థితిని అధినేతకు రాష్ట్ర నేతలు వివరించారు. తెలంగాణలో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సని చర్యలపై షా, నడ్డా దిశానిర్దేశం చేశారు.