బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్

నూతన సచివాలయ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ సచివాలయ ముట్టడికి యత్నించింది. సచివాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన ఎమ్మెల్యే రాజాసింగ్‌తో పాటు పలువురు బీజేపీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా రాజాసింగ్‌ మాట్లాడుతూ.. రూ.600 కోట్ల ప్రజా ధనాన్ని కేసీఆర్‌ నీళ్లపాలు చేస్తున్నారని మండిపడ్డారు. వాస్తు దోషం పేరుతో సచివాలయం, అసెంబ్లీని కూల్చడాన్ని బీజేపీ వ్యతిరేకిస్తుందని చెప్పారు. పేద ప్రజల కోసం రెండు లక్షల ఇళ్లు నిర్మించి ఇస్తామన్న కేసీఆర్‌.. 20వేల ఇళ్లు కూడా కట్టలేదని మండిపడ్డారు. సచివాలయం, అసెంబ్లీ భవనాల పేరుతో  వందల కోట్లు వృథా చేసే బదులు పేద ప్రజలకు వెచ్చించాలని డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌.. ప్రజాధనాన్ని వృథా చేస్తుంటే ప్రజలే కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు.