లాల్‌దర్వాజ గుడికి నిధులు... కేసీఆర్ కుట్ర అంటోన్న రాజాసింగ్..!

లాల్‌దర్వాజ గుడికి నిధులు... కేసీఆర్ కుట్ర అంటోన్న రాజాసింగ్..!

తాజాగా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ.. సీఎం కేసీఆర్‌ను కలవడం... ఓల్డ్ సిటీలోని లాల్ దర్వాజ మహంకాళి ఆలయానికి నిధులు అడగడం.. సీఎం వెంటనే రిలీజ్ చేయడం జరిగిపోయాయి.. అయితే, దీని వెనుక పెద్ద కుట్ర ఉందని ఆరోపిస్తున్నారు బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్.. సీఎం చెబితేనే అక్బరుద్దీన్ ఒవైసీ.. లాల్ దర్వాజ గుడికి నిధులు అడిగారని ఆరోపించిన ఆయన.. అక్బరుద్దీన్‌పై హిందువుల్లో వ్యతిరేక ఉంది... అక్బరుద్దీన్‌ హిందూ వ్యతిరేకి అనే ముద్రణను తొలగించడానికే కేసీఆర్ ఇలా ప్లాన్ చేశారని విమర్శించారు. కేసీఆర్.. ఎంఐఎంకే ముఖ్యమంత్రియా అని ప్రశ్నించిన రాజా సింగ్... మాకు ఎందుకు కేసీఆర్ అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదు? మా నియోజకవర్గ సమస్యలు ఎందుకు పట్టించుకోరు? కోరు అని ప్రశ్నించారు. గతంలో తాను చేసిన వ్యాఖ్యలపై అక్బరుద్దీన్ క్షమాపణలు చెబితేనే హిందువులు నమ్ముతారని వ్యాఖ్యానించారు రాజాసింగ్.