ఎంఐఎం సిద్ధాంతాలకే వ్యతిరేకిని : రాజాసింగ్

ఎంఐఎం సిద్ధాంతాలకే వ్యతిరేకిని : రాజాసింగ్

ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే సిఎం కేసీఆర్ ఎంఐఎం ఎమ్మెల్యేని  ప్రొటెం స్పీకర్ చేశారని బిజెపి ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు.ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన రాజాసింగ్, ప్రమాణస్వీకార సమయంలో ఫ్యానల్ స్పీకర్ గా టిఆర్ఎస్ అభ్యర్ధి కూర్చునేటపుడే ఎమ్మెల్యేగా ప్రమాణం చేస్తానని తేల్చి చెప్పారు. తనను అనర్హుడిగా ప్రకటించాలని  అంటున్న కాంగ్రెస్ పార్టీకి సిగ్గు ఉండాలని ఆయన మండిపడ్డారు. తాను ఏ వర్గానికి వ్యతిరేకం కాదని, ఎంఐఎం సిద్ధాంతాలను మాత్రమే తీవ్రంగా వ్యతిరేకిస్తానని చెప్పుకొచ్చారు. వందేమాతరానికి విలువ నివ్వని పార్టీని గౌరవించాల్సిన అవసరం, తమకు లేదని రాజాసింగ్ స్పష్టం చేశారు.