కుమారస్వామి ప్రభుత్వం ఉండేది 24 గంటలే..!

కుమారస్వామి ప్రభుత్వం ఉండేది 24 గంటలే..!

కర్ణాటక రాజకీయాలు ఇప్పుడు హాట్ టాఫిక్ అయ్యాయి... ఓవైపు సీఎం కుమారస్వామి తాజాగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపగా... మరోవైపు జేడీఎస్‌-కాంగ్రెస్‌ కూటమి మరో 24 గంటల్లో కూలిపోతుందని ఆ రాష్ట్ర బీజేపీ నేత చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. బీజేపీలో సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న కత్తి ఉమేష్... గతంలో మంత్రిగానూ పనిచేసిన అనుభవం ఉంది... నిన్న బెల్గాంలో జరిగిన ఓ సమావేశం సందర్భంగా మీడియాతో మాట్లాడిన కత్తి ఉమేష్... జేడీఎస్-కాంగ్రెస్ కూటిమి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. 15 మంది కాంగ్రెస్‌ తిరుగుబాటు ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారు... వారు రాజీనామా చేస్తారు.. దీంతో 24 గంటల్లో కుమార స్వామి ప్రభుత్వం పడిపోతుందని... వచ్చే వారమే కర్ణాటకలో బీజేపీ సర్కార్ ఏర్పడబోతోందని వ్యాఖ్యానించారు. 224 శాసనసభ స్థానాలున్న కర్ణాటకలో అధికార కాంగ్రెస్‌-జేడీఎస్‌ కూటమికి 120 మంది సభ్యుల బలం ఉంది.. 104 మంది బీజేపీ ఎమ్మెల్యేలున్నారు. అయితే సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. ముఖ్యంగా కుమారస్వామి తాజాగా కేబినెట్‌ను విస్తరించడంతో కొంతమంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు నిరాశకు లోనయ్యారు. ఇదే అవకాశాన్నా ఉపయోగించుకోవాలన్న యోచనలో బీజేపీ ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, మరికొందరు నేతలు మాత్రం తాము ప్రతిపక్షంలోనే ఉంటామని వ్యాఖ్యలు చేస్తున్నారు.